నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
నేడు వెలువడిన SSC ఫలితాలలో స్థానిక నేలకల్ రోడ్డు కు చెందిన నలంద హై స్కూల్ విద్యార్థులు 500 పైగా ఐదుగురు విద్యార్థులు మార్కులు సాధించి విజయదుందుభి మోగించారని పాఠశాల అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
K. లాస్య 559 /600,
S. మనోజ్ కుమార్557/600,
D. సూర్య 557/600,
G. నిర్విఘ్న 555/600,
K. వర్ష 550/600

మార్కులు సాధించారని మిగతా విద్యార్థులు 100% రిజల్ట్స్ సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు అట్లూరి మురళి కృష్ణ విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఫలితాలు నలంద పాఠశాల మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు గర్వకారణం అని అన్నారు. గౌరవాధ్యక్షులు ప్రకాశం, ప్రధాన కార్యదర్శి ఇంగు శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇంగునేహా, ప్రధానోపాధ్యాయిని పద్మావతి, ప్రిన్సిపల్ టీఎస్ తనూజ, వైస్ ప్రిన్సిపాల్ జి మురళి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయినిలు విద్యార్థి బృందం యాజమాన్యం పాల్గొన్నారు.

