నిజామాబాద్ రూరల్ మే 20( ప్రజాగళం)
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా ఉన్నాయని అన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని, నిజామాబాద్ రూరల్ మండలంలోని 29 మంది లబ్ధిదారులకు, మోపాల్ మండలంలోని 25 మంది లబ్ధిదారులకు, డిచ్పల్లి మండలంలోని 70 మంది లబ్ధిదారులకు, ఇందల్వాయి మండలంలోని 15 మంది లబ్ధిదారులకు, జక్రన్ పల్లి మండలంలోని 50 మంది లబ్ధిదారులకు, సిరికొండ మండలంలోని 19 మంది లబ్ధిదారులకు,మొత్తంగా 208 మందికి లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను అందించడం జరిగిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల పల్లి భూపతి రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మరో పథకం ఇందిరమ్మ ఇండ్లు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో మొదటి విడతగా సొంతగా భూమి ఉన్న వారికి 3200 ఇండ్లను మంజూరు పత్రాలను ఇచ్చామని , కొంతమంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకోవడం జరిగిందన్నారు, కొంతమంది లబ్ధిదారులు బేస్ మీట్ లెవెల్ వరకు కట్టినవారికి లక్ష రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం జరిగిందని అన్నారు. సొంత భూమి లేనివారికి రెండో విడతలో 75 గజాల భూమిని ఇచ్చి , ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటేశ్వర్లుగా చేయడమే ప్రధాన ధ్యేయమని అన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి నడిపించడం జరుగుతుందని, ఇందిరమ్మ శక్తి క్యాంటీన్ ల ద్వారా మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం మని అన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పీసీసీ డెలికేట్ శేఖర్ గౌడ్, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, చిన్నారెడ్డి, నవీన్ గౌడ్, రవి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

