నిజామాబాద్ క్రైమ్ జూన్ 11( ప్రజా గళం)
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీ పీ సాయి చైతన్య హెచ్చరించారు.
ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో ఈ మద్య కాలంలో మాజీద్ ఖాన్, వారి కుటుంబ సభ్యుల పై పాత కక్షలు మనసులో పెట్టుకొని తాళ్ల నవీన్, టేకుమల్ల మనోజ్, గొల్ల అశోక్, సంఘముల నిఖిల్, వడ్లూరి రంజిత్ కుమార్, కటికే రమేష్ వీరందరూ కలిసి ముప్పేట దాడి చేయడం జరిగిందని సిపి సాయి చైతన్య తెలిపారు.
ఈ దాడిలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసి , కేసు పై పక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి, ఎవ్వరు ఈ చర్యకు కారకులో వారిని గుర్తించి రిమాండ్ చెయ్యడం జరిగిందన్నారు.
నిజామాబాద్ పోలీస్ కమీషనరెట్ పరిధిలో ఎవ్వరయిన భవిష్యత్తులో ఎలాంటి అల్లర్లకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించిన వారిపై పూర్తి స్థాయి ” నిఘా వ్యవస్థ” ఉంటుందని ప్రతీ ఒక్కరు తమ నడవడికను మార్చు కోవాలని, లేనిపక్షంలో వారి పై తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని సి పి హెచ్చరించారు. ఎవ్వరికైనా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం
కలిగిoచడం లేదా సమాజంలో ఉద్రిక్తతలను రేపే విధంగా వ్యవహారించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, హెచ్చరించారు. పోలీస్ శాఖాపరంగా శాంతియుత వాతావారణం నెలకొల్పేందుకు నిర్విరామంగా కృషి జరుగుతుందని, ప్రజల సహాకారం అత్యంత ప్రధానమైనదని వెల్లడించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిoచే వారి సమాచారం ఎవ్వరికైనా తెలిసిన మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని లేదా ఈ దిగువ తెలియజేసిన ఫోన్ నెంబర్లకు తెలియజేయగలరు. సమాచారం ఇచ్చిన పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి వివరాలు ఈ క్రింది నెంబర్లకు తెలియజేయాలన్నారు.
డయల్ 100 స్పెషల్ బ్రాంచ్ నంబర్
87126-5977 పోలీస్ కంట్రోల్ రూమ్
నెంబర్ :08462-226090
లకు సమాచారం
ఇవ్వగలరు.

