జిల్లా జైల్లో ఘనంగా యోగా దినోత్సవం.

 

నిజామాబాద్ క్రైమ్ జూన్ 21( ప్రజాగళం )

నిజామాబాద్ జిల్లా జైల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ కేంద్ర కారాగారం, పర్యవేక్షణాధికారి చింతల దశరథం ఆధ్వర్యంలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమములో అధికారులు, సిబ్బంది, ఆశ్రమవాసులతో యోగా కార్యక్రమం ను యోగా మాస్టర్ జలందర్ గౌడ్ ప్రాదమిక పాఠశాల నీలా ఉపాద్యాయుడు యోగా నిర్వహించి వారి మానసిక, శారీరక ఆరోగ్యం బాగా ఉండేట్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్ష అనుభవిస్తున్న వారి మనస్సు ద్యానం వైపు ఉండేటట్లుగా ద పిరమిడ్ స్పిర్చువాల్

సొసైటీ మూమెంట్ స్థాపకుడు బ్రహ్మరుషి సుభాష్ పత్రిజీ, ద్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాద్యాయులు . మల్లు గౌడ్,రజితవాణి, వెంకటేష్, మహేష్ పతంజలి యోగా కేంద్రం తారపున సాయిలు జిల్లా ఇంచార్జి యోగా మాస్టర్స్ ప్రభాకర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.. కేంద్ర కారాగార అధికారులు డాక్టర్.. దినేష్ గంగా,, సాయి సురేష్ బాబు, రాజశేఖర్ రెడ్డి, ఉపేందర్ జైలర్లు, అనిల్ కుమార్, మన్మద రావు, డిప్యుటీ జైలర్లు, అశోక్ కుమార్, నారాయణ,, గార్డింగ్ సిబ్బంది 550 మంది ఆశ్రమవాసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.