యోగా దినోత్సవం రోజున పలువురు ప్రశంసలు అందుకున్న యోగా గురువు ఐశ్వర్యకాలే.

 

నిజామాబాద్ సిటీ జూన్ 21( ప్రజాగళo)

అంతర్జాతీయ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ లోని ఆరోగ్య రక్ష యోగ కేంద్రం నింపునురాలు ఐశ్వర్య తన శిక్షకులతో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని శ్రీరామ గార్డెన్ లో

తమ శిక్షకులచే పలు విన్యాసాలు వేయించారు. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, సిపి సాయి చైతన్య లు హాజరై ఐశ్వర్య తన బృందం చేయించిన

యోగ విన్యాసాలను వీక్షించారు. అయితే ఇటీవల ఆరోగ్య రక్ష యోగ కేంద్రం నిపుణురాలు ఐశ్వర్య మలేషియాలో కౌలాలంపూర్ లో తన యోగ విన్యాసాలతో అత్యుత్తమ ప్రతిభ పురస్కారం అందుకుంది.

Leave A Reply

Your email address will not be published.