ఆదుకోకుంటే రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి.

నిజామాబాద్ సెప్టెంబర్ 30 ( ప్రజాగళం ప్రతినిధి)

రైతులను ఆదుకోకుంటే వారి ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

బడా భీంగల్ నుండి అక్లూర్ వెళ్లే దారిలో రోడ్ పై కి. మీ మేరా రాసులుగా పోసి ఉన్న మక్కలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.

అక్కడే ఉన్న రైతులతో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడగ ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టక ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు మక్కలు అమ్ముకోవడం వలన నష్టపోతున్నమని రైతులు ఎమ్మెల్యే తో తమ ఆవేదన వెలిబుచ్చారుఈ సందర్బంగా ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాలుకు 2400 మద్దతు ధర తో పాటు మీరు ఇచ్చిన హామీ ప్రకారం అదనంగా 400 రూపాయలు ఇచ్చి 2800 లకు కొనుగోలు చేయాలనీ ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే రైతుల దగ్గర మక్కలు క్వింటాలకు 2800 రూపాయలు వచ్చే వ న్నారు…ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోయేసరికి దళా రులకు 1600 లకు రైతు అమ్మేసుకుంటున్నాడని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ప్రతి రైతుకు క్వింటాలుకు సుమారు 1000 రూపాయల చొప్పున నష్టపోతున్నారని,.ఒకరైతు ఎకరాకు 30 క్వింటాలు మక్కలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రవేట్ వ్యాపారులకు అమ్మి ఎకరాకు 30000 రూపాయలు నష్టపోతున్నాడన్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

రైతులు పంటను సరైన ధరకు అమ్ముకోలేక నష్టపోయి బాధపడుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.

రైతుల బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి ఎం లాభం అని ఆయన అన్నారు.

నేను ఇప్పటికే ప్రతి సొసైటీ ల ద్వారా ఊరురా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేశానని, అయినా ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో చలనం లేదని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

వర్షాలు పడుతున్నాయని మక్కలు ఫంగస్ వచ్చినట్లయితే ధర రాక రైతులు ఇంకా నష్టపోయే అవకాశం ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మీరు ఇచ్చిన మాట ప్రకారమే 2400 మద్దతు ధర ఉన్న మక్కలకు అదనంగా 400 కలిపి క్వింటాలుకు 2800 లకు కొనుగోలు చేయాలన్నారు.

ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని,లేకుంటే ఈ రైతుల ఉసురు మీకు, ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందన్నారు.

మీ ప్రభుత్వం క్వింటాలుకు 2800 చెల్లించి కొనుగోలు చేసేవరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.