ఎడపల్లి,మార్చి 4: (ప్రజా గళం)
ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఆనందోత్సా హల మధ్య హోలీ పండుగ వేడుకలు జరుపున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ స్థానిక సర్పంచ్ పరిగె సాయిలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి హోలీ పండుగ వేడుకలు జరుపు కున్నారు.గ్రామంలో హోలీ పండుగ వేడుకల సంబురా లు మిన్నంటాయి.కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి,గాండ్ల గంగాధర్,గాంధారి అనీల్ రెడ్డి, రాజ గౌడ్,రాజు గౌడ్,శేఖర్ రెడ్డి,పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పెద్దఎత్తున హోలీ పండుగను జరుపుకున్నారు.

