ముఖ్యమంత్రి పర్యటన ను విజయవంతం చేసిన కలెక్ట ర్,ఎస్పీ,ఏఎస్పి,అదనపు కలెక్టర్,సబ్ కలెక్టర్ లకు ఘనంగా సన్మానం….

 

బాసర,ఏప్రిల్ 9: (ప్రజా గళం)

బాసర మండల కేంద్రంలో ఈ నెల 6 న దేవస్థాన అభి వృద్ధి పనులు,భూమిపూజ కార్యక్రమం నిమిత్తం విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గ పర్యటనను విజయవంతంగా పూర్తి చేయుటలో తమవంతు పాత్ర పోషించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ని,జిల్లా ఎస్పీ జానకీ షర్మిలని,ఏఎస్ పి సాయికిరణ్ ని,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుని,సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ లను గురువారం ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు వారి వారి కార్యాలయాలకు వెళ్లి మర్యాదపూ ర్వకంగా కలిసి అమ్మవారి ప్రసాదం,శేషావస్త్రంతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం తరపున వారికి ప్రత్యేక ధన్యవాద ములు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ గంగా శ్రీనివాస్,ప్రధానార్చకులు సంజీవ్ పూజారి, వేదపండితులు నవీన్ శర్మ,సంజయ్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.