ఎడపల్లి,ఏప్రిల్ 29: (ప్రజా గళం)
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రా మంలో స్థానిక కోల సాయిలు అనే వ్యక్తిపై బుధవారం కోతి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.ఒక పక్క కుక్కలు,మరో పక్క కోతులు స్వైర విహారం చేస్తూ గ్రామస్తులపై దాడులు చేస్తున్నాయని సాయిలు కుమా రుడు కోల రాజు తెలిపారు.తన తండ్రిని కోతి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందని అన్నారు.గ్రామంలో కోతుల బెడద,కుక్కల బెడదతో భయాందోళనకు గురవుతున్నామని అయన తెలిపారు.ప్రాణాలు అరచే తిలో పెట్టుకోవల్సి వస్తోందని అన్నారు.ఇటీవల గ్రామం లో పిచ్చి కుక్క నలుగురిని కరిచి గాయపరిచిందని తెలిపారు.ఇలా కోతులు,కుక్కల వలన భయాందోళన కలిగిస్తోందని,అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.గ్రామ ప్రజలు కోరుతున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులు, కుక్కల బెడద లేకుండా అరికట్టాలని కోల రాజు అధికా రులను,స్థానిక సర్పంచ్ ని కోరారు.

