ఆర్మూర్ ఏప్రిల్ 30 (ప్రజాగళం)
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ శివారులోని గాంధీ నగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించరు.
పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను హరిణి 572 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచారు. సి హెచ్ వినీల 567, జి రిషిక 563, ఎం ప్రసన్న లక్ష్మి 562, పి హారిక 560 మార్కులు సాధించగా 550 మార్కుల పైగా ఏడుగురు విద్యార్థులు జి వైశాలి (557), డి గ్రీష్మ 556, కే అనీషా 554, ఎన్ ఫణీంద్ర 553, ఎన్ ఆశ్రిత్ 552, డి సంజన 552, వై శ్రీనిక 552 మార్కులు సాధించారని,
100% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ గారు తెలిపారు.
మొత్తం 75 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 66 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినందుకు ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థుల విజయానికి అహర్నిశలు కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్, పాలనాధికారిణి పద్మ, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో
విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

