పదవ తరగతి ఫలితాలలో శ్రీ భాషిత పాఠశాల విద్యార్థుల అఖండ విజయం

 

ఆర్మూర్ ఏప్రిల్ 30 ( ప్రజా గళం)

 

ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు, 2025-26 సంవత్సరం పదవ తరగతి (SSC) ఫలితాలలో అఖండ విజయం కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ, తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి, పాఠశాల పేరు ప్రతిష్టలను మరింతగా పెంచారని తెలిపారు. కృత్తిక 563, నైతిక 558, శ్రుతిక 552, ధనరాజ్ ,మనితేజ 541 మార్కులు సాధించి, స్కూల్ టాపర్లుగా నిలిచారన్నారు.

31 మంది విద్యార్థుల్లో, 15మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి ఉత్తీర్ణులయ్యారు. 16 మంది 67 శాతం పైగా 500 లోపు మార్కులు సాధించారన్నారు.

 

పాఠశాల కరస్పాండెంట్ భాషిత సుందర్ మాట్లాడుతూఈ విజయం, శ్రీ భాషిత పాఠశాల యొక్క శ్రద్ధ, క్రమశిక్షణ, మరియు నాణ్యమైన బోధనకు నిదర్శనం అని అన్నారు.

ఈ విజయానికి కారణమైన విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం కారణమని పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు. అట్టి తోడ్పాటును అందించిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ఆయన తెలియజేశారు.

భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఇలాంటి అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ తల్లిదండ్రుల, పాఠశాల కీర్తిని మరింతగా పెంచాలని సుందర్ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.