నిజామాబాద్ ఏప్రిల్ 30 (ప్రజా గళం ప్రతినిధి)
పోస్టర్ కేర్ లోనే రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఘనత సాధించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కొనియాడారు.
మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క చేతులమీదుగా పోస్టర్ కేర్ ఇవ్వటం జరిగింది.
నిజామాబాద్ జిల్లా బాలసదనంలో ఆశ్రమం పొందుతున్న అమ్మాయిని హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో మంత్రివర్యుల చేతులు మీదుగా పోస్టర్ కేర్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆరు సంవత్సరాలు లోపు పిల్లలను దత్తత ప్రక్రియ లో భాగం చేయాలని, దత్తత వెళ్లలేని ఆరు సంవత్సరాలు పైబడిన పిల్లలను కుటుంబ వాతావరణం కల్పించే విధంగా పోస్టర్ కేర్ ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలు కుటుంబంలో పెరగాలని దీనివల్ల సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకుంటారని మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పోస్టర్ కేర్ తీసుకోవడానికి కుటుంబాలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు.
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి పోస్టర్ కేర్ ఇచ్చిన జిల్లాగా నిజామాబాద్ ఘనత సాధించడం జరిగిందని తెలపడంలో సంతోషిస్తున్నాను. ఈ ఘనత సాధించడంలో సహకరించిన నిజామాబాద్ జిల్లా అధికారులకి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత, రామచంద్రన్ డైరెక్టర్ శృతి ఓజ, తెలంగాణ రాష్ట్రం బాలల హక్కుల కమిషన్ సభ్యులు వందన, అపర్ణ,జాయింట్ డైరెక్టర్ మోతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్, గణేష్, ప్రత్యూష డైరెక్టేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

