ఎడపల్లి పెద్ద చెరువులో ప్రమాదవాశాత్తు పడి వ్యక్తి మృతి….

ఎడపల్లి,ఆగస్టు 6: (ప్రజా గళం)

ఎడపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ఐటి గణేష్(39)అనే వ్యక్తి ప్రమాదవాశత్తు పడి మృతి చెం దాడు.ఎస్ఐ ముత్యాల రమ తెలిపిన వివరాలు ప్రకా రం..రుద్రూర్ గ్రామానికి చెందిన ఐటి గణేష్ మంగళవా రం ఎడపల్లి గ్రామంలో ఉంటున్న తన భావ వద్దకు వచ్చాడు.ఎడపల్లి గ్రామంలోని పెద్ద చెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళుతున్నట్లు సాయం త్రం చెప్పి ఐటి గణేష్(39)వెళ్ళాడు.కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో ప్రమాదవాశాత్తు కాలు జారీ చెరు వులో పడి మృతి చెందినట్లు ఎస్ఐ రమ తెలిపారు. మృతుని భార్య ఐటి రేఖ బుధవారం ఉదయం ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.