బాన్సువాడ, ఆగస్టు 15: ప్రజాగళం. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జాతీయ గీతాన్ని ఆలపించి త్రివర్ణ పతాకానికి ఘనంగా వందనం సమర్పించారు.ఈ సంద ర్భంగా చందూరి హన్మండ్లు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అన్నారు. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్య తాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభి వృద్ధి పథంలో దూసుకుపోతోందని, దేశాన్ని మరింత ముందుకు తీసు కెళ్లేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించాలని కోరారు. అనంతరం కార్యకర్తలు “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” నినాదాలతో పరిసరాలను మారుమోగించారు.
కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు భాస్కల సాయిలు, దళిత మోర్చా మండల అధ్యక్షులు గంగాధర్, నాగరాజు, గంగాధర్ గుప్తా, శ్రీనివాస్, రాములు, బూత్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యస్వామి, కంది మల్లేష్, రవికాంత్, దత్తు, విఠలేష్ తదితరులు పాల్గొన్నారు.

