ఎంఎస్ సి ఫారం లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం విజయవంతం…టీబీ స్క్రీనింగ్ క్యాంప్ లో 331 మందికి టిబి స్క్రినింగ్ పరీక్షలు….డాక్టర్ వినీత్ కుమార్ రెడ్డి…

 

 

ఎడపల్లి,ఆగస్టు 31: (ప్రజా గళం)

టిబి ముక్త్ భరత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం మండల ప్రాథమిక వైద్య ఆరో గ్య కేంద్ర ఆసుపత్రి సహకారంతో స్థానిక జిపి కార్యాల యంలో టిబి.స్క్రినింగ్ క్యాంప్ నిర్వహించారు.ఈ టిబి స్క్రినింగ్ క్యాంప్ కు ప్రజలు పెద్దఎత్తున్న తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా టీబీ స్క్రీనింగ్ క్యాంప్ విజయవంతమైంది.ఈ క్యాంప్ లో రోగి లక్షణాల ఆధారంగా యాక్టివ్ టీబీ స్క్రీనింగ్‌తో పాటు సిఎక్స్ఆర్,ఎన్ఎఎటి పరీక్షలు,అలాగే హెచ్ఐవి, సిఫిలిస్ పరీక్షలు నిర్వహించడం జరిగింది అని మండల వైద్యధికారి డాక్టర్.వినీత్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ క్యాంప్ లో 92 మందికి సిఎక్స్ఆర్ స్క్రినింగ్,ఎన్ఎఎటి కోసం 79 మందికి కఫం సేకరణ,70 మందికి హెచ్ఐవి పరీక్షలు,70 మందికి సిఫీలిస్ పరీక్షలు,70 మందికి సిఫీలిస్ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ వినీత్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజలకు టిబి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అని అన్నారు.మండల వైద్య శాఖ ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు టిబి స్క్రినింగ్ క్యాంప్ నిర్వ హించడం అభినందనీయమని అన్నారు.వైద్యులు ప్రజలకు అవసరమైన టిబి పరీక్షలు నిర్వహించి,ఆరో గ్యం పై జాగ్రత్తల గురించి వైద్యులు సూచించారని అన్నారు.అలాగే వ్యాధులకు అనుగుణంగా వారికి ఉచితంగా మందులు పంపిణి చేశారని అన్నారు.టిబి ముక్త్ భారత్ అభియాన్ పథకం ద్వారా ప్రజలకు టిబి నివారణకు మెరుగైన వైద్యం అందిస్తూ వారికి ఉచితం గా మందులు పంపిణి చేస్తున్నారని సర్పంచ్ జయశ్రీ పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ వైజర్ దేవేంద ర్,టిబి(ఎస్ టిఎస్)సూపర్ వైజర్ ఎండి.ఆయున్ అహ్మద్,లు మాట్లాడుతూ..శిబిరంలో టిబి స్క్రినింగ్ తో పాటు అలాగే ఎక్స్ రే,తెమడ పరీక్షలు,రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది అని వారు తెలిపారు.టిబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా గ్రామ పంచాయ తీలో నిర్వహించిన క్యాంప్ కు ప్రజలు పెద్దఎత్తు పాల్గొని విజయవంతం చేసినందున ప్రతి ఒక్కరికి ధన్యవాద ములు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్ర మంలో సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్,కార్యద ర్శి జవాజి రాజు,కారోబార్ కృష్ణ,ఎస్టిఎస్,టిబి నోడల్ ఆఫీసర్,ఎంపిహెచ్ ఎస్,ఎంపిహెచ్ఎస్,ఎంఎల్ హెచ్ పిలు,ఎఎన్ఎం లు,ఆశావర్కర్ లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.