నిజామాబాద్, జనవరి 03( ప్రజాగళం ప్రతినిధి )
నవీపేట్ మండల కేంద్రంలో కలకలం రేపిన ముగ్గురు బాలికల మిస్సింగ్ కేసులో ఒకరి ఆచూకీ లభ్యమైంది. ముగ్గురులు ఒకరైన శిరీష అనే అమ్మాయి అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో నిజామాబాద్ బస్టాండ్ లో పోలీసులు గుర్తించారు. లభ్యమైన బాలిక ద్వారా మరో ఇద్దరి కోసం పోలీసులు విచారణ చేశారు. మరో ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళిక లు గురువారం ఉదయం పాఠశాలకు రాకుండా నిజామాబాద్ కు వచ్చి తిరిగినట్లు తెలిసింది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అదృశ్యమైన బాలికల్లో ఒకరి ఆచూకీ లభ్యం
Prev Post
