కొడంగల్ నిధులలో 25 శాతం నిధులు తెస్తే కాంగ్రెస్ నాయకులకు సన్మానం చేస్తా గత ప్రభుత్వంలో నిలిచి పోయిన నిధులు కొత్త సంవత్సరం కానుకగా ఇచ్చారు. ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా ముద్దడడం కాంగ్రెస్ నాయకులకు చెల్లింది కాంగ్రెస్ నాయకుల అవాస్తవ ప్రచారానికి దీటైన రీతిలో స్పందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులలో నుండి 25 శాతం నిధులు నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి కి తెస్తే కాంగ్రెస్ నాయకులకు బహిరంగంగా సన్మానం చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం నగరంలోని
భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో సావిత్రి బాయి పులే 194వ జయంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా, నగరంలో ఆగిపోయిన పనులను ప్రారంభించే దిశగా, పెండింగ్ లో ఉన్న నిధుల మంజూరుకై నిరంతరం ప్రభుత్వంతో కొట్లడుతున్నమన్నారు.ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పై ఎప్పటికప్పుడు ఇక్కడ జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించి డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి రావలిసిన టఫ్ ఐడిసి ఫండ్ 60 కోట్లు, గత ప్రభుత్వం హయాంలో డివిజన్ కి కోటి రూపాయల చొప్పున మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని నిలిపేసి అభివృద్ధికి అడ్డుగా నిలిచింది వాస్తవమన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి పెండింగ్ లో ఉన్న టఫ్ ఐడిసి ఫండ్ 60 కోట్ల బకాయి విడుదల చేయాలనీ ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ రావు కు, రోడ్లు భవనాలు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ల దృష్టికి తీసుకుపోతే, మన జిల్లాకు రావలిసిన ఫండ్ హక్కుగా కొట్లాడి తేవడం జరిగిందని అన్నారు. దానికి సంబందించిన జీఓ కాపీని ప్రభుత్వానికి ఇచ్చిన లేఖను మీడియకి చూపడం జరిగింది.దాన్ని కాంగ్రెస్ నాయకులు ఏదో కొత్తగా, కొత్త సంవత్సరంకి బహుమతి ఇచ్చినం అని మతి లేని మాటలు మాట్లాడటం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి 50వేల ఉద్యోగాలు ఇచ్చినం అని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, అసలు కాంగ్రెస్ ఏడాది లో ఇస్తానన్న 2లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కాదు కాని ఎవరికో పుట్టిన బిడ్డ మాదే అని ఎత్తుకొని ముద్దాడటం బాగా వచ్చునని ఏద్దేవా చేశారు. స్పెషల్ ఫండ్ పేరుతో వచ్చిన 10 కోట్లు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల పెడితే దానికి లెక్క లేదు పత్రం లేదని, ఎక్కడ అభివృద్ధి పనులకు వాటిని ఖర్చు చేసారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.కాంగ్రెస్ నాయకులు చేసే కమిషన్ల దోపిడీకి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదని, పెండింగ్ లో ఉన్నకాంట్రాక్టర్ల బిల్లులు మంజూరుకి కమిషన్లు కసరత్తులు చేస్తున్నారని అన్నారు.కమిషన్ల పైన ఉన్న శ్రద్ద, రాష్ట్ర అభివృద్ధి పైన లేకపోవడం నిజంగా సిగ్గుచేటని పేర్కొన్నారు. జిల్లాలో పేరుకే కాంగ్రెస్ నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నారని, జిల్లా అభివృద్ధికి తెచ్చిన నిధులు శూన్యం అని అన్నారు.
పీసీసీ అధ్యక్షులు ఒకాయన,కామారెడ్డి లో చెల్లని రూపాయి ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ సలహాదారుడు ఒకాయన, ఇందరులో ఉన్న ఇందూర్ ను పట్టించుకునే సోయి లేదని మండిపడ్డారు.
నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావడానికి తను సిద్ధంగా ఉన్నానని,
ఐటీ హబ్ లో ముఖ్యమైన కంపెనీలు లేవని, చిన్న చిన్న జీతాలు ఇచ్చే కంపెనీలు మాత్రమే ఉన్నాయన్నారు. జిల్లాలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేగా నేను ఒక్క అవినీతికి పాల్పడలేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.