ది ఎయిర్ ఫోర్స్ స్కూల్ నందు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

నిజామాబాద్ ( ప్రజాగళం అర్బన్):

నగరంలోని గాజుల్ పేట్ నందు గల ది ఎయిర్ ఫోర్స్ స్కూల్ నందు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని కరస్పాండెంట్ గిరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విద్యార్థినిలు మహిళా టీచర్లు గా మారి బోధన చేశారు . ఈ సందర్భంగా కరస్పాండెంట్ గిరీష్ మాట్లాడుతూ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందాలంటే చదువుకోవాలని అప్పటి కాలం నుండే అనేక శ్రమకోర్చి మహిళలకు చదువు చెప్పిన తొలి మహిళ సావిత్రిబాయి అని తెలిపారు. మహిళలు సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.