నిజామాబాద్ నవంబర్ 10 (ప్రజా గళం ప్రతినిధి )
జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న ప్రభుత్వ ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారులుగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ నెల 13 వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ లో సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

