బాన్సువాడ డిసెంబర్ 30, ప్రజాగళం. బాన్సువాడ నియోజకవర్గం
బీర్కూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో బీర్పూర్ సర్పంచ్ అరిగే ధర్మ తేజ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ పరమేష్, వార్డు సభ్యులు మహేష్, ఐకేపీ సీసీ భూమయ్య, మెహరినీత, నాగమణి, జీవిత, హేమావతి, భాగ్య పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ, రాజు, మెక్కా రమేష్, కృష్ణ, శివ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

