అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వ సలహాదారులు కలిసిన వామపక్ష పార్టీల నాయకులు.

 

నిజామాబాద్,జూలై 29,ప్రజాగళం:

 

వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ సీపీఎం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్, న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారిని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ఈనెల 24న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపులో పాల్గొన్న జిల్లాలోని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారన్నారు.

నీట్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విద్యార్థులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయన్నారు. ఉద్యమానికి దిగివచ్చిన కేంద్రం కేసులను ఎత్తివేస్తూ ప్రకటన చేసిందన్నారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి, వేధిస్తున్నారన్నారు. పోలీసులు రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి వత్తాసు పలుకుతూ విద్యార్థి సంఘాల నాయకులపై కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నష్టంచేసే చర్య అవుతుందన్నారు. విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు , పోలీసు కమిషనర్ గారితో మాట్లాడి కేసులను ఎత్తివేసేలా చూడాలన్నారు. నీటి లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు కే.గణేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.