నిజామాబాద్ క్రైమ్ ఆగస్టు 1 (ప్రజా గళం)
నెల రోజుల వ్యవధిలో కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ XII” లో 119 మంది బాలలకు విముక్తి కల్పించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఆపరేషన్ ముస్కాన్ కొనసాగిందన్నారు.ఈ ఆపరేషన్ ముస్కాన్ ముఖ్య ఉద్దేశ్యం 18 సంవత్సరాల లోపు అపహరించబడిన, తప్పిపోయిన,కార్మికులుగా ఉన్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షణలోకి తీసుకొని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించడం జరిగిందని సీపీ తెలిపారు. తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సి.డబ్ల్యూ.సి) కి అప్పగించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచి , వారి ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందన్నారు.
ఈ ఆపరేషన్ ముస్కాన్ XII లో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గల నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్లలో మొత్తం 119 మంది మగ పిల్లలను గుర్తించామన్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా
నిజామాబాద్ డివిజన్ పరిధిలో 19 ఎఫ్.ఐ.ఆర్లు,ఆర్మూర్ డివిజన్ పరిధిలో 15,బోధన్ డివిజన్ పరిధిలో 14 కలిపి
మొత్తం 48 ఎఫ్.ఐ.ఆర్లు నమోదు చేశామన్నారు.
అలాగే తప్పిపోయిన పిల్లల వివరాలను “ట్రాక్ చైల్డ్” లో నమోదు చేసి వారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నమన్నారు.
ఈ ఆపరేషన్ ముస్కాన్ XII లో పట్టుకున్న పిల్లల వివరాలు సబ్ డివిజన్ వారీగా గుర్తించిన బాలల వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 43 మంది బాలలను,
బోధన్ సబ్ డివిజన్ పరిధిలో 49 మంది బాలలను,
ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 27 మంది బాలలను గుర్తించడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.

