ప్రజాగళం నిజమాబాద్ రూరల్.ఫిబ్రవరి…15….ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామానికి చెందిన .బీజేపీ కీలక యువ నాయకుడు సంతోష్ కుమార్ శుక్రవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెల్లట్ల సంతోష్ కుమార్ గతంలో బీజేపీ తో పాటు పలు పార్టీల రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా సంతోష్ కుమార్ తెలంగాణ ఉద్యమం లో విద్యార్థి నాయకుడిగా, ఉద్యమ నేతగా, జర్నలిస్ట్ గా కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బిజెపికి. గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

ఆయన వెంట బీజేపీ కీలక నేతలు మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి,మాజీ జెడ్పిటిసి సామెల్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహర్ ఖాద్రి, ఎల్లారెడ్డి మండల యూత్ ఉపాధ్యక్షులు కిరణ్ తేజ, వెల్లట్ల గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు యామ రాజయ్య, యామా సాయిలు, గాదె రాజయ్య, చీకుల రాములు, ఒట్లెం భూమయ్య, పండుగ వెంకట రాములు, ప్రకాష్, రమేష్, వెంకట్, కనుకుల బాలరాజు, గౌస్, తదితరులున్నారు.

