మానవ జీవితంలో సైన్స్ ప్రథమ స్థానం NDCCB CEO నాగభూషణం వందే, DEO అశోక్

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
మానవ జీవితంలో సైన్స్ ప్రథమ స్థానంలో ఉంటుందని విద్యార్థులు తమ జీవితంలో సాంకేతికతను జోడించుకొని ముందుకు వెళ్లాలని సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండాలని భవిష్యత్తులో మంచి శాస్త్రజ్ఞులుగా స్థిరపడాలని అన్నారు. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని గురువారం నిర్మలా హృదయ పాఠశాలలో జరిగిన వేడుకలలో ముఖ్య అతిథిగా DEO అశోక్, NDCCB CEO నాగభూషణం వందే పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ను తిలకించారు.

సైన్స్ ఫెయిర్ లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిజిఎం లింబాద్రి పాఠశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.