నిజామాబాద్ మార్చ్ 20 ( ప్రజా గళం ప్రతినిధి )
నిజామాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తా లోని టీఎన్జీవో భవన్ లో
నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో టీఎన్జీవో ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్టార్ విందులో ఉద్యోగులతో పాల్గొనడం చాలా ఆనందంగా ఉoదని,
ముస్లిం సోదర సోదరీమణులు ఉద్యోగుల అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిందన్నారు.
రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు సుమన్, ను డా చైర్మన్ కేశ వేణు, నరాల రత్నాకర్, టీఎన్జీవోస్ నాయకులు నారాయణరెడ్డి, శంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

