కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో యోగా దినోత్సవం.

 

నిజామాబాద్ సిటీ జూన్ 21( ప్రజాగళo).

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సుభాష్ నగర్ లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో శనివారం యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రామోజీరావు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయని ఆ పరిస్థితులను అధిగమించాలంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని అన్నారు. అందుకు యోగా చేయడం మంచి మార్గమని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను దినచర్యగా చేసుకోవాలని కోరారు. కార్యక్రమం లో విద్యార్థుల చేత కొన్ని యోగ ఆసనాలు వేయించి ఉత్తేజపరిచారు. ఈ మధ్యకాలంలో నిర్వహించిన యోగా పోటీలలో పాఠశాలకు చెందిన విద్యార్థిని స్మైత్రిక రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా విద్యార్థిని, అలాగే కోచ్ గంగాధర్ ను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.