ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి:
విద్యుత్ షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయ్యి సర్వం కోల్పోయిన సంఘటన శుక్రవారం జరిగింది.
మోపాల్ మండలం బోర్గం (పి)ఐదవ డివిజన్ కామర్స్
నడిపి గంగారం చెందిన ఇల్లు విద్యుత్ షాట్ సర్క్యూట్ తో దగ్ధం కావడంతో ఇంటిలోని వస్తువులన్నీ ఖాళీ బూడిదయ్యాయి. బాధితుల తెలిపిన ప్రకారం..బాబాయ్ కూతురు ఎంగేజ్మెంట్ ఉండడంతో అర్సపల్లి గ్రామానికి వెళ్ళిన మాకు ఇంటిలో మంటలు చెరగడంతో స్థానికులు సమాచారం అందించగా హుటాహుటిన ఇంటి వద్దకు స్థలానికి చేరుకున్నామని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా మంటలని ఆర్పి వేశారని, అప్పటికే ఇంటిలో ఫ్రిడ్జ్ దగ్గర మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం కాలిపోయినట్లు తెలిపారు.
ఇంట్లో వివాహం కోసం దాచుకున్న బంగారు నగలు డబ్బు అన్ని ఖాళీ బూడిదయ్యాయని, తినడానికి సరుకులు లేక రోడ్డున పడ్డామని సుమారు తొమ్మిది లక్షల వరకు ఆస్తి నష్టం అయిందని బాధితులు వాపోతున్నారు.ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

