నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
సోమవారం 33/11kv వినాయక్ నగర్ ఉప కేంద్రంలో ఎమర్జెన్సీ మరమ్మతుల కారణంగా నిజామాబాద్ పట్టణంలోని క్రింద తెలిపిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లో ఉదయం 9.00 గంటల నుండి 11-00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని TGNODCL నిజామాబాద్ టౌన్ అదే 1 రమావత్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ,వినాయక నగర్, 100ఫీట్ రోడ్ ,ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ, కోటగల్లి, గాయత్రి నగర్, చందనగర్, న్యాల్కల్ రోడ్, శ్రీనగర్, ఫూలాంగ్, గోల్ హన్మాన్ ఏరియా, ఆకుల పాపయ్య రోడ్ ,గూడెం,తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుంది. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు.

