నిజామాబాద్ ( ప్రజాగళం అర్బన్ న్యూస్):
ఆదివారం 78వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం హైదరాబాద్ లోని కాచిగూడ లో ఉన్న టీవీ STU భవన్ లో జరిగింది,ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ సమస్యల సాధనలో STU ముందుంటుందని ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఏ సమస్యా వచ్చిన ముందుఉండి సాధించడానికి కృషిచేస్తుంది అని అన్నారు. మనముందు ఇంకా అనేక సమస్యలైన పీఆర్సీని అమలు చేయించడం, CPS రద్దు చేయించడం, 317 GO బాధితులను స్వంతజిల్లాలకి పంపించడం,SSA ఉద్యోగస్తుల ను రెగ్యులర్ చేయించడం,ఎయిడెడ్ ఉపాధ్యాయుల 37/2005
సమస్యను సాధించడం, డైట్,జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేసేవిధంగా కృషి చేయాలని రాష్ట్ర సంఘానికి వివరించారు. ఈసందర్భంగా రాష్ట్ర సంఘానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ధర్మేంధర్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు బెల్లాల్ శ్రీనివాస్,రాష్ట్ర కో కన్వీనర్ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.

