నిజామాబాద్ (ప్రజా గళం అర్బన్ న్యూస్)
ఆదివారం స్థానిక గొట్టుముక్కల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మరియు మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బీరెల్లి విజయ రావు మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఆరోగ్యానికి సంబంధించిన వివిధ సేవలు చేయటంలో రోటరీ ఎల్లప్పుడు ముందుంటున్నది దీనిలో భాగంగానే ఈరోజు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి సౌజన్యంతో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ శిబిరం ను దాదాపు 175 మంది ప్రజలు సద్వినియోగం చేసుకోవడం జరిగినది. హైదరాబాద్ నుండి విచ్చేసిన డాక్టర్ల బృందం గ్రామ ప్రజలకు చికిత్స చేసి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ నేత్ర వైద్య నీపుణులు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు డాక్టర్ పిబి కృష్ణమూర్తి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి ఆధునిక జీవనంలో ప్రతి మనిషి 6 నెలలకు ఒకసారి తన ఆరోగ్యం పరీక్షలను చేసుకోవాలని అనేక రకాల వైరస్ ల కారణంగా వ్యాధులు వ్యాపిస్తున్నాయని వాటి నుండి దూరంగా ఉండడానికి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యo ఇటువంటి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు జి రామకృష్ణ, జుగల్ సోనీ, పర్శి రాజేశ్వర్, బిరెల్లి నర్సింగరావు, రాజ్ కుమార్ సుబేదార్, సతీష్ షాహ,ఇన్గు రాజేశ్వర్, శ్రీరామ్ సోనీ, ధన్పాల్ శ్రీనివాస్ తదితరులతోపాటు మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనిరుద్, డాక్టర్ ముఖేష్ డాక్టర్ రమ్య, డాక్టర్ ఆఫ్రిన్ మరియు వారి సహచర బృందంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి సిబ్బంది, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

