*డైట్ మెనూ ను ప్రారంభించిన TUGA చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్*

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
శనివారం నగరంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ నందు రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన విద్యార్థుల డైట్ మెనూ ను తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హాందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు కొత్త డైట్ మెన 40 శాతం చార్జెస్ పెంచి రాష్ట్ర ప్రభుత్వం రూపుదిద్దించిదని తెలిపారు. గత 8 సంవత్సరాలలో ఎలాంటి మెస్
చార్జిలు పెంచలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 40శాతం పెంచడం జరిగిందన్నారు మరియు 200 శాతం కాస్మెటిక్ చార్జెస్ పెంచామని ఇది గత 16 సంవత్సరాలలో ఇదే మొదటిసారి కాస్మెటిక్ చార్జీలు పెంచడం అని తెలిపారు.

విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉందని, ఎలాంటి అవాంతరాలకు ఆస్కారం ఇవ్వకుండా పనిచేస్తున్న అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.