నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వెనుక భాగాన స్వెటర్స్ దుకాణాలను నడుపుతున్న ఎన్క్రొచ్మెంట్ లను మునిసిపల్ సిబ్బంది కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం తొలగించారు. రోడ్లపై ఖాళీ జాగాలపై కట్టెలుపాతి షెడ్ లాగా చేసుకుని వ్యాపారాలు నడుపుతే సహించేది లేదని హెచ్చరించారు.

ప్రభుత్వము మున్సిపాలిటీ అనుమతిస్తేనే టెంపరరీ షాపులు పెట్టుకోవాలని లేకుంటే లేదని డిప్యూటీ ఈ ఈ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

