నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
భారత మానసిక వైద్య సమాజం మరియు జాతీయ యువ మానసిక వైద్యుల సదస్సు మానసిక వైద్య ప్రక్రియలో లైంగిక సమస్యలకు నూతన చికిత్సలు అనే అంశంపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాగపూర్ లో జరిగిన సదస్సుకు ముఖ్య వక్త గా హాజరై ప్రసంగించారు. “అడ్వాన్సుడ్ ట్రీట్మెంట్ ఇన్ సెక్సువల్ డిసార్డర్స్ సైకియాట్రిక్ ప్రాక్టీస్”అనే అంశంపై డాక్టర్ విశాల్ ఆకుల, డాక్టర్ మనస్వి గౌతమ్ జైపూర్, డాక్టర్ నిష్కాసింహ పాట్నా, తదితరులు పాల్గొని విలువైన అభిప్రాయాలను పంచుకున్నామని తెలిపారు. ఈ చర్చ ఆసక్తికరంగా సాగి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది అన్నారు. ఈ సమావేశానికి డాక్టర్ టి ఎస్ ఎస్ రావు, డాక్టర్ కె. మిశ్రా అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల నిర్వాహకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఆయన భారత మానసిక వైద్య సమాజ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీకాంత్ రాధీ ,నిర్వాహక కార్యదర్శి డాక్టర్ ప్రీతం చండోక్ తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

