సకాలంలో ఆస్తి పన్ను/ ఇంటి పన్నులు చెల్లించండి

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్): నిజామాబాద్ కార్పొరేషన్ ప్రజలకు తెలుపుడం ఏమనగా మీ యొక్క ఇంటి పన్ను ఆస్తి పన్ను దుకాణం పన్నులు సకాలంలో చెల్లించి నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మునిసిపల్ కమిషనర్ మరియు అర్బన్ ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి అర్థ సంవత్సరం నాకు సంబంధించిన ఆస్తి పన్నును జూన్ 30 లోపు చెల్లించవలెను లేనియెడల అట్టి పన్ను పై జూలై 1 నుండి రెండు శాతం పెనాల్టీ విధించబడుతుందన్నారు.2వ అర్ధ సంవత్సరానికి డిసెంబర్ 31 లోపు చెల్లించాలి జనవరి 1 నుండి రెండు శాతం పెనాల్టీ విధించబడును. కావున ప్రజలందరూ వెంటనే తమ ఆస్తి పన్ను చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు, లేని యెడల పెండింగ్ ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.