శిశు గృహంలో మూడు నెలల పసికందు మృతి.

నిజామాబాద్ డిసెంబర్ 24 (ప్రజా గళం)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో గల శిశు గృహంలో మూడు నెలల పసికందు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గత సెప్టెంబర్ 15వ తేదీన జిల్లా ఆస్పత్రిలో స్వతంత్ర అనే పసికందు జన్మించింది. ఓ మతిస్థిమితం లేని అమ్మాయి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. 9 నెలలు దించడంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా పాపకు జన్మనిచ్చి చెత్త బుట్టలో పడేసి వెళ్ళిపోయింది. అనంతరం అధికారులు శిశువును స్వాధీనం చేసుకుని సంరక్షణ కోసం శిశు గృహానికి తరలించారు. శిశు గృహంలో స్వతంత్ర అనే పసికందు అసస్థకు గురి కావడంతో శిశు గృహ సిబ్బంది పాపను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆఫీస్ విషమించి మంగళవారం ఉదయం శిశువు మృతి చెందింది. అయితే శిశువు మృతి చెందడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శిశు గృహాo లో మొత్తం 24 మంది పిల్లలు ఉండగా వారికి సరైన వైద్యం అందించే డాక్టర్ పరిరక్షణ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రస్తుతం శిశు గృహాo లో 23 మంది చిన్నారులు ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే పాప చనిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. శిశు గృహంలో చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.