ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి:
మతోన్మాదం,కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐ జాతీయ నేతల పిలుపునిచ్చారు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి.రాజా, జాతీయ నాయకులు కామ్రేడ్. సురవరం సుధాకర్ రెడ్డి కార్యకర్తలను,ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఏర్పడ్డ సిపిఐ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించిందని, నాటి స్వాతంత్ర పోరాటం, తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణ త్యాగం చేశారని అన్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాదంపై, కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై సిపిఐ శత జయంతి ఉత్సవాల స్ఫూర్తితో మరింత ఉత్తేజంగా పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సభలో నిజామాబాద్ జిల్లా నుండి సిపిఐ నాయకులు పి.సుధాకర్, వై ఓమయ్య, సురేష్ ఇమ్రాన్ ఆలీ, ఫేరోజ్ రాధా కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.

