ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్.

నిజామాబాద్ బ్యూరో జనవరి 9 ( ప్రజాగళం)

జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. అవసరమైన చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మరమ్మతు పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేిశించారు. నాణ్యతతో పనులను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఈ శంకర్ కు సూచించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.