హైదరాబాద్ (ప్రజాగళం అర్బన్):
భారత మానసిక వైద్య సంఘం ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (IPS) 76వ వార్షిక జాతీయ సదస్సు జనవరి 22 నుండి 25 వరకు 4రోజుల పాటు హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నోవాటెల్ హోటల్ నందు జరగనుందని ఐపీఎస్ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీకాంత్ రాటి ఒక ప్రకటనలో తెలిపారు. న్యూరో బయాలజీ ఆఫ్ “ఇల్నేస్ టు వెల్నెస్” అనే అంశంతో ప్రత్యేక సదస్సు మానసిక వైద్యశాస్త్రంలో ఉన్నత ఆవిష్కరణలను విశ్లేషిస్తూ మానసిక రోగాలను అర్థం చేసుకోవడం మరియు సమగ్ర ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్ మానసిక వైద్య నిపుణులు మార్గదర్శకులు ప్రొఫెసర్ డాక్టర్ పి రఘురమీ రెడ్డి ఆశీర్వాదం మరియు మార్గదర్శనలో నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా ప్రఖ్యాత వక్తలు మరియు ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వక్తలను ప్రతినిధులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. తాజా పరిశోధనలు క్లినికల్ అప్లికేషన్లు మానసిక వైద్యశాస్త్రంలో ఉన్నత ఆవిష్కరణలపై చర్చల కోసం ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు.

*సదస్సు నిర్వాహక బృందం*
ప్రొఫెసర్ డాక్టర్ పి. కిషన్ ఐపీఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు మరియు నిర్వాహక కమిటీ చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ ఎం. ఉమాశంకర్ ఐపీఎస్ బ్రాంచ్ అధ్యక్షుడు మరియు నిర్వాహక కార్యదర్శి, డాక్టర్ వి. జార్జి రెడ్డి ఐపీఎస్ సౌత్ జోనల్ బ్రాంచ్ జనరల్ సెక్రెటరీ నిర్వాహక కోశాధికారి, డాక్టర్ జి. జగన్నాథ్ సంయుక్త కార్యదర్శి మాజీ అధ్యక్షులు ఐపీఎస్ తెలంగాణ రాష్ట్ర శాఖ, ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల సంయుక్త కార్యదర్శి మరియు ఐపీఎస్ తెలంగాణ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రెటరీ, ప్రొఫెసర్ డాక్టర్ సాయికృష్ణ పులి సంయుక్త కోశాధికారి. ఈ సందర్భంగా ఐపీఎస్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ అలీమ్ చందాని జనరల్ సెక్రెటరీ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల సదస్సు విజయవంతం చేయాలని నిర్వాహక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

