బాన్సువాడ రూరల్ , ప్రజా గళం:
బాన్స్వాడ మార్కండేయ మందిరంలో గురువారం పద్మశాలి సంఘం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనరసింహులు, బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగం గంగాదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాజిల్లాఅధ్యక్షుడు,రాష్ట్ర కార్యనిర్వాహకఅధ్యక్షులు సిరిగాద లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేయాలని,సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు.ఆర్థిక పరంగా,సేవాపరంగా చేతనైన సహాయాన్ని సంఘానికి అంద చేయాలన్నారు. అన్ని జిల్లాల కంటే కామారెడ్డి జిల్లా సభ్యులకి రాష్ట్ర ఎన్నికలలో అధిక ప్రాధాన్యత ఇచ్చి, చాలామంది సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ఈసందర్భంగాఆయన గుర్తు చేశారు . ప్రధానంగా బాన్సువాడ డివిజన్ నుండి అత్యధిక సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు.ఇక్కడ జరిగే కార్యక్రమాలు వాళ్లు సంఘానికి చేస్తున్న కృషినని, బాన్సువాడ డివిజన్ సభ్యులను కొనియాడారు.బాన్సువాడ డివిజన్ సభ్యులందరూ సంఘాన్ని బలోపేతం చేసి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నారు.బాన్స్వాడ పట్టణంలోని పద్మశాలి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు డివిజన్, మండలాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు,మహిళా సంఘ సభ్యులు, పద్మశాలి కుల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

