నిజామాబాద్ జనవరి 17 ( ప్రజా గళం ప్రతినిధి).
నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలో బీజేపీ నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్స్ స్రవంతి రెడ్డిని స్థానికులు నిలదీశారు. గత ఐదేళ్లుగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ముందే తమ ఆవేదనను వెలిబుచ్చారు. జిల్లా కేంద్రంలోని 43వ డివిజన్ పరిధిలోని హమాల్ వాడి ప్రాంతంలో సిసి రోడ్డు, డ్రైనేజీ పనుల భూమి పూజ కార్యక్రమానికి ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు స్రవంత్ రెడ్డి, ఎర్రం సుధీర్ లు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్ లు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన కాలనీవాసులు స్రవంత్ రెడ్డిని గెలిపిస్తే ఒక్కసారి కూడా కాలనీలో పర్యటించలేదని, ఏనాడు సమస్యలను పట్టించుకున్న పాపనా పోలేదని ఎమ్మెల్యే సమక్షంలోనే నిలదీయడం తో ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కార్పొరేటర్ స్రవంతి రెడ్డి స్థానికులను సముదాయించే ప్రయత్నం చేసిన వారు వినిపించుకోలేదు. అంతేకాకుండా స్థానిక సమస్యలు పట్టించుకోవడంలేదని కాలనీవాసులతో పాటు స్థానిక బిజెపి నాయకులు నిలదీయడం స్థానికంగా కలకలం రేపింది. అదేవిధంగా స్థానిక 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుదీర్ ను స్థానికులు గుర్తుపట్టకపోవడం గమనార్వం.

