బాన్సువాడ రూరల్, ప్రజా గళం.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడా ZPHS ఉన్నత పాఠశాలలో GHM రాములు పై దాడికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు సోమవారం మధ్యాహ్నo విరామ సమయంలో నల్ల బ్యాడ్జ్ లతో నిరసన తెలియచేశారు.ఈ సందర్బంగా SGT సంఘం కామారెడ్డి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఉన్నత పాఠశాలలో GHM రాములు పై మూక దాడి చేయడమే కాకుండా వారి విధులకు ఆటంకం ఏర్పర్చారన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇది హెయమైన చర్య గా భావించి ప్రభుత్వ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో
LFL ప్రధానోపాధ్యాయులు గోపి, ఉపాధ్యాయులు సాయిరాం, చైతన్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

