అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు. కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్.

బాన్సువాడ రూరల్, ప్రజాగళం:

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ పరిధిలో ని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో జరిగిన వార్డు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డు లేనివారు కార్డు కొరకు దరఖాస్తులు చేసుకోవచ్చని రేషన్ కార్డు రాలేదని ఆందోళన చెందవద్దన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ప్రభుత్వం పేదల కోసం పాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహసిల్దార్ వరప్రసాద్, మైనారీటీ జిల్లా అధ్యక్షులు ఖలేఖ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ , నార్ల సూరి , ఉదయ్ , గుడాల నగేష్ , గొల్ల వెంకన్న , షాహబ్ , సాయిలు , నర్సన్న చారి మాజీ వార్డ్ సభ్యులు దాసరి శ్రీనివాస్, రాయిస్ ,జహీర్ ,షోయెబ్, నాయకులూ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.