నిజామాబాద్ జనవరి 23( ప్రజా గళం ప్రతినిధి )
బోధన్ మాజీ శాసనసభ్యులు షకీల్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే బియ్యం అక్రమ రవాణా కేసును ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యేకు బ్యాంకు రూపంలో మరో షాక్ తగిలింది.తీసుకున్న రుణం సకాలంలో చెల్లించడం లో విఫలం అయ్యారని ఎస్.బి.ఐ. నోటీసులు జారీ చేసింది.19 కోట్లు బకాయిలు గడువు లోగా చెల్లించకుంటే పూచీకత్తు గా పెట్టిన ఆస్తుల జప్తు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు.మాజీ ఎం.ఎల్. ఏ. షకీల్ దంపతుల పేరిట ఎస్బిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. బ్యాంకు నోటీసులతో బోధన్ నియోజకవర్గంలో మరోసారి షకీల్ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే షకీల్ తనయుడి రోడ్డు ప్రమాద కేసు రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీసిన షకీల్ కు తాజాగా జారీ చేసిన ఎస్బిఐ బ్యాంకు నోటీసులు ఉచ్చుగా మారనున్నాయి. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా రాజకీయాలకు,నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలలో ఆయన సతీమణి పాల్గొంటున్నారు.

