అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తాం

ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి:
అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తామని కార్పొరేటర్ నర్సు బాయి, డివిజన్ ఇంచార్జ్ వైశాక్షి సంతోష్ అన్నారు. శుక్రవారం
ప్రజా పాలన భాగంలో డివిజన్ 21 ఎల్లమ్మ గుట్టలో వార్డ్ సభ డివిజన్ ఇంచార్జ్ వైశాక్షి సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.వార్డ్ సభలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను చదివి వినిపించారు. ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇంకా దరఖాస్తు చేసుకోవలసిన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్పొరేటర్ నర్సు బాయి, వైశాక్షి పుష్పలత, ఆసిఫ్ జావిద్ మహేశ్వర్, గౌసియా కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.