ప్రజా గళం క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి.

నిజామాబాద్ బ్యూరో జనవరి 24 (ప్రజాగళం )
తెలుగు దినపత్రిక ప్రజాగళం 2025 నిజామాబాద్ ఏ సి పి రాజా వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రజా గళం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించి పత్రిక యాజమాన్యాన్ని అభినందించారు. పత్రికలు సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలని ఎసిపి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాగళం ఎడిటర్ కొక్కు రవికుమార్, సీనియర్ జర్నలిస్ట్ కొట్టూరు శ్రీనివాస్, కర్క రమేష్, పబ్బు భూమేష్, లోకం తీరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.