ప్రజా గళం నిజామాబాద్ ప్రతినిధి:
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎక్సైజ్ సీఐ స్వప్నకు ఉత్తమ ప్రతిభా పురస్కారం లభించింది. ఎక్సైజ్ శాఖ లో నేరాలను అరికట్టడం లో, మాదకద్రవ్యాలు పట్టుకోవడం లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ స్వప్న కు తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పంపిన ప్రశంసపత్రాన్ని అందజేయగా ఆదివారం నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ స్వప్నకు అందచేశారు.

