వినయ్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి :- కాంగ్రెస్ నాయకులు

ఆర్మూర్ జనవరి 27 (ప్రజాగళం):

ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలని ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్, కాంగ్రెస్ నాయకులు పండిత్ పవన్, తాజా మాజీ కౌన్సిలర్ కొంత మురళి అన్నారు. సోమవారం ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వినయ్ రెడ్డి ,జీవన్ రెడ్డి మాట్లాడిన తొమ్మిది నిమిషాల సంభాషణ తన వద్ద ఉందంటూ రాకేష్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వినయ్ రెడ్డి ,జీవ రెడ్డితో తొమ్మిది సెకండ్లు కూడా మాట్లాడలేదని వారన్నారు. ఇరువురి సంభాషణ ఉంటే బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. వినయ్ రెడ్డిని బాధ్యత కలిగిన నాయకుడు అన్నారు .నారా లోకేష్ ని ఎమ్మెల్యే పైడిరాకేష్ రెడ్డి ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి కృషి చేయాలని ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలన్నారు హెచ్చరించారు. కార్యక్రమంలో భూపేందర్ ,చిట్టి రెడ్డి, మారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.