పోలీస్ ట్రైనింగ్ సెంటర్(సిటీసి)లోకి వచ్చిన చిరు త పులి…కుక్కను పట్టుకెళ్లిన చిరుత… కుక్కల అరుపులకు గదిలో ఉన్న కానిస్టేబుల్ చూడగా కనిపించిన పులి….భయంతో లోపలకు వెళ్లి తలుపులు బిగించుకున్న కానిస్టేబుల్…. పులి కోసం అడివిని గాలించిన ఫారెస్ట్ అధికారులు… పాదముద్రాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు….

ఎడపల్లి,జనవరి 31: ( ప్రజా గళం ):

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో చిరుత పులి ప్రజలను వణికిస్తోంది.మొన్న ఒక బ్యాంక్ ఉద్యోగిని వెంబడించాగా,ఈ రోజు పోలీస్ ట్రైనింగ్ సెంటర్(సిటీసి)లోకి వచ్చి కుక్కను నోటకరుచుకొ ని వెళ్లిన చిరుత పులిని ప్రత్యక్షంగా కానిస్టేబుల్ చూసి భయకాంపితుడయ్యడు.వామ్మో చిరుత పులి అంటూ ప్రజలు అడవి మధ్య ఉన్న రహదా రుల వెంట వెళ్లాలంటనే భయం భయంగా ప్రజలు వణికి పోతున్నారు.అటవీ శాఖ అధికారులు అడ విలో పులి జాడకోసం గాలిస్తున్నారు,వాటి పాద ముద్రలను పరిశీలిస్తున్నారు.బాధితులు అటవీ శాఖ అధికారులు తెలిపిన కథనం ప్రకారం… ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి సమీపంలోగల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సోమవారం రాత్రి ఠాణాకలాన్ గ్రామంలో ఎస్ బిఐ బ్యాంక్ లో విధులు ముగించుకొని నిజామా బాద్ కు బైక్ మోటార్ ఫై వెళుతుండగా చిరుత పులి వెంబడించింది.

పులిని చూసిన అతను బైక్ ను స్పీడ్ తీసుకెళ్లి దాని భారీ నుండి తప్పించు కున్నాడు.విషయం తెలుసుకున్న అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్ బీట్ ఆఫీసర్ తో కలిసి మంగళవారం పులి ఆనవాల కోసం గాలించి పాద ముద్రలను సేకరించారు. ఠాణాకలాన్ సబ్ స్టేషన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎటువైపు వెళ్లిందో వాటి జాడను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంతటితో అయిపోలేదు పులి సంచారం… జాన్కంపేట్ గ్రామ శివారులోని ఠాణాకలాన్ వేళ్ళు మార్గ మధ్యన గల పోలీస్ ట్రైనింగ్ సెంటర్(సిటి సి)లోకి చిరుత ఎంట్రీ అయ్యింది.గురువారం ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లోకి వెళ్లిన చిరుత పులిని చూసిన కుక్కలు గట్టిగ మొరుగా(అరిచాయి)యి. కుక్కలు ఎందుకు అరుస్తున్నాయో చూసేందుకు గదిలో నుండి తలుపులు తీసి బయటకొచ్చి చూ డగానే చిరుతపులి కుక్కను పట్టుకొ(నోటకర్చుకు) ని వెళుతుండటాన్ని కానిస్టేబుల్ సాయిలు ప్రత్యే క్ష్యంగా చూశాడు.


భయ కంపితుడైన కానిస్టేబుల్ సాయిలు వెంటనే గదిలోకి పరుగులు తీసి తలు పులు బిగించుకున్నాడు.విషయం పోలీస్ ఉన్నత ధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నత పోలీస్ అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచా రం ఇచ్చారు.వెంటనే సిటీసి సెంటర్ కు చేరుకున్న అటవీ శాఖ(ఫారెస్ట్)రేంజ్ అధికారి సంజయ్ గౌడ్, సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్ తో కలిసి చిరుతపులి సంచ రించిన అటవీ ప్రాంతాన్ని,సిటీసి పరిసర ప్రాంతా లను గాలించారు.చిరుత పాదముద్రలను గుర్తిం చారు.ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ సంజయ్ గౌడ్ మాట్లాడుతూ..ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తు న్న విషయం వాస్తవమేనని,రాత్రి పూట దీని సంచారం వుంటుందని,కావున ప్రజలు అప్రమ త్తంగా వుండాలని సూచించారు.ఠాణాకలాన్ – జానకంపేట్,ఠాణాకలాన్ -బాపూనగర్,జానకంపే ట్-దూపల్లి గేట్ రహదారులలో వెంట ప్రయాణించే ద్విచక్ర వాహన దారులు మరియు ఒంటరిగా ప్రయాణించకుండా ఇద్దరుకి మించి కలిసి ప్రయా ణం చేయాలని సూచించారు.


చిరుత కనబడితే దానికి దగ్గరగా వెల్లకుండా ఆగి పోవాలని,గట్టిగా శబ్దం చేస్తే చిరుత వెల్లి పోతుందని,కావున ప్రజలు గమనించి మెదలు కోవాలని ఎఫ్ఆర్ఓ సంజయ్ గౌడ్ తెలిపారు.అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ వెంట సెక్షన్ అధికారి ప్రతాప్ తో పాటు, సిటీసి సెంటర్ పోలీస్ ఇన్స్పెక్టర్ శివరామ్,పోలీస్,అటవీశాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.