ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులే కీలకం కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు నో ఛాన్స్

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ )

రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఉపాధ్యాయ సంఘాలే ముందంజలో ఉన్నాయి అల్లాటప్ప ఓట్లు కాదు అందరూ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వేసే ఓట్లు పార్టీలకు అస్సలు ఓటు వేయరు నిలబెట్టడం వేస్టు ప్రస్తుతం ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. నర్సిరెడ్డి, పూల రవీందర్, శ్రీపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి తదితరులు పిఆర్టియు, టిఎఫ్ టిపియూఎస్, utf ఉపాధ్యాయ సంఘాల నుండి పోటీ చేస్తున్నారు.. ఒకతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ పి అర్ టి యు ఓట్లను చీలిస్తున్నాడు,, రాష్ట్ర నేత శ్రీపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డి తదితరులు బరిలో ఉండటంతో ఓట్లు చీలి పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం విజయానికి దోహదపడుతుందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీగా గతంలో గెలిచిన పూల రవీందర్ టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు రెండోసారి పూల రవీందర్ ఓటమిపాలయ్యారు. పి అర్ టిఆర్టియు తరఫున శ్రీపాల్ రెడ్డికి సీటు దక్కింది బిజెపి అనుబంధ సంఘ సంఘమైన టి పి యు ఎస్ సర్వోత్తమ్ రెడ్డి తరఫున మరియు కాంగ్రెస్ ఇండిపెండెంట్గా హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేయుచున్నారు. వీరు కాక ఆల్ ఫోర్స్ కాలేజ్ అధినేత నరేందర్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది ఆర్మూర్ కు చెందిన ఏసీపీగా రాజీనామా చేసి ఎమ్మెల్సీ బరిలో గంగాధర్ దిగుతున్నారు. ఎక్కువ మట్టుకు చాన్సు ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులది అని చెప్పక తప్పదు. పిఆర్సి ఏ ద్యేయంగా ఎజెండా మరియు కేజీబీవీ తదితర సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాల పెంపు పెర్మనెంట్ చేయడం ప్రధాన ఎజెండాగా అన్ని పార్టీలు పెట్టుకున్నారు. గెలిచినవారు కాంగ్రెస్ లో చేరక తప్పదు. అప్పుడే ఎమ్మెల్సీ నిధులు విరివిగా విడుదల అవుతాయి. ఇండిపెండెంట్గా గెలిచి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటే నూకలు చెల్లవు. కచ్చితంగా గ
గెలిచిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సిందే లేనిచో భవిష్యత్తు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కారుకు ఇంకా నాలుగు సంవత్సరాల పదవీకాలం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది.

Leave A Reply

Your email address will not be published.