బాన్సువాడ టౌన్, ఫిబ్రవరి 7, ప్రజాగళం.
రెడ్డి కులస్తుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రెడ్డి సంఘం సభ్యులు బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా రెడ్డి సామాజిక వర్గంపై తన రాజకీయ లబ్ది కోసం రెడ్డిలను కించ పర్చే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి మాట్లాడడం సబబు కాదని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో రెడ్డి సంఘం అద్యక్షుడు మాసాని అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాశం రాజి రెడ్డి, ర్యాల నరసింహరెడ్డి, లక్ష్మరెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

